Vijayashanti

Vijayshanti తెలుగు చిత్రసీమకు లేడీ సూపర్ స్టార్. తన యాక్షన్‌తో స్ట్రీట్ ఫైటర్ అవతారమెత్తిన మగరాయుడు. భారత నారిగా తన కర్తవ్యం నెరవెర్చిన పెంకిపెళ్లాం కూడా. గ్లామర్‌కి గ్రామర్ నేర్పిన లేడీబాస్. ఒసేయ్ రాములమ్మ గా దుర్మార్గులను ప్రతిఘటించిన అరుణ కిరణం. తన నటనతో ఒక హిస్టరిని క్రియేట్ చేసారు. అంతేకాదు యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్‌తో లేడీ అమితాబ్‌గా పేరు తెచ్చుకున్నారు. విజయశాంతి పేరు చెబితే తెరపై ఆమె చేసిన పోరాటాలే కాదు. ఆమె ఒలికించిన శృంగారం కూడా గుర్తుకొస్తుంది. అటు ఫర్ఫామెన్స్ ఓరియంటెడ్ మూవీస్‌లో నటిస్తునే.. ఇటు గ్లామర్ డాల్‌గా తన సత్తా చాటింది. ఆడియన్స్ చేత విశ్వ నట భారతిగా పిలిపించుకుంది.

కెరీర్ మొదట్లో ఎక్కువగా గ్లామర్ పాత్రలనే చేసిన విజయశాంతికి నటిగా మంచి గుర్తింపు ఇచ్చిన సినిమా ‘నేటి భారతం’. ఈతరం ఫిలింస్ పతాకంపై టి.కృష్ణ దర్శకత్వంలోవచ్చిన ఈ చిత్రం నటిగా విజయశాంతికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత నటిగా విజయశాంతి వెనుదిరిగి చూసుకోలేదు. అప్పటికే జయసుధ, జయప్రద తమ అభినయంతో.. శ్రీదేవి,మాధవి తమ అందచందాలతో తెలుగుతెరను ఏలుతున్న రోజుల్లో నటిగా.. విజయశాంతి సినీ ప్రస్థానం ప్రారంభమైంది. అప్పటికే కథానాయికలుగా స్థిరపడిన వారిని సవాలు చేస్తూ విజయశాంతి విజృంభించింది

Vijayashanti Career:

1964 జూన్ 24న వరంగల్‌లో జన్మించింది. విజయశాంతి అసలు పేరు శాంతి. తెర పేరులోని విజయను తన పిన్ని విజయలలిత పేరు నుంచి తీసుకుంది. హీరోయిన్ గా విజయశాంతి ఫస్ట్ మూవీ 1979లో వచ్చిన ‘కల్లుక్కుళ్ ఈరమ్’ అనే తమిళ మూవీ. ఈ సినిమాలో నటించేటపుడు విజయశాంతి వయసు పదిహేనేళ్లే. మాతృ భాష తెలుగులో విజయశాంతి యాక్ట్ చేసిన మొదటి చిత్రం ‘కిలాడీ కృష్ణుడు’. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా తెరకెక్కిన ఈమూవీ నటిగా విజయశాంతి కి మంచి మార్కులే పడ్డాయి.

విజయశాంతి తన 30 సంవత్సరాల సిని ప్రస్థానంలో వివిధ భాషా చిత్రాలలో వివిధ పాత్రలలో సుమారు 180 సినిమాలకు పైగా నటించింది. విజయశాంతి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషా చిత్రాలలో నటించింది.

విజయశాంతి అగ్నిపర్వతం (సినిమా), ప్రతిఘటన, రేపటి పౌరులు, పసివాడి ప్రాణం, మువ్వగోపాలుడు, యముడికి మొగుడు, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు, జానకిరాముడు, ముద్దుల మావయ్య, కొండవీటి దొంగ, లారీ డ్రైవర్, శత్రువు (సినిమా), గ్యాంగ్ లీడర్, రౌడీ ఇన్‌స్పెక్టర్, మొండిమొగుడు పెంకి పెళ్ళాం, చినరాయుడు వంటి విజయవంటమైన సినిమాలలో నటించింది.

Vijayashanti చిరంజీవితో అత్యధికంగా 19, బాలకృష్ణతో 17, కృష్ణతో 12, శోభన్ బాబుతో 11, సుమన్ తో 7 చిత్రాలలో నటించింది.

విజయశాంతి 1991 లో కర్తవ్యం సినిమాలో నటించిన నటనకు గానూ జాతీయ సినిమా ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంది. విజయశాంతి ఏడుసార్లు దక్షిణాది ఫిలిం ఫేర్ పురస్కారాలను, ఆరు సార్లు ఉత్తమ నటి పురస్కారాన్ని, 2003లో దక్షిణ భారతదేశ ఫిలింఫేర్ లైఫ్ టైం అఛీవ్‌మెంటు పురస్కారాన్ని పొందింది.

విజయశాంతి నాలుగు రాష్ట్ర నంది పురస్కారాలను అందుకుంది. 1985లో ప్రతిఘటన సినిమాలో పాత్రకు నంది పురస్కారాన్ని పొందింది.

1987లో విజయశాంతి చిరంజీవి తో కలసి నటించిన స్వయంకృషి చిత్రం మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లోనూ, హాలీవుడ్ నటుడు థామస్ జనె తో నటించిన పడమటి సంధ్యారాగం సినిమా లూస్వెల్లీస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడినాయి.

1990లలో సినిమా కథానాయకులతో సమానంగా పారితోషకం డిమాండ్ చేసిన ఏకైక సినిమా నటిగా గుర్తింపు పొందింది. విజయశాంతి నటించిన కర్తవ్యం సినిమాలో రెమ్యూనిరేషన్ ఒక కోటి రూపాయలు ఆ కాలంలో ఏ కథానాయికలు పొందని అత్యంత ఎక్కువ రెమ్యూనిరేషన్.

Vijayashanti Marriage:

Vijayashanti 1987లో శ్రీనివాస్ ప్రసాద్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అతను స్వయానా నందమూరి బాలకృష్ణ అక్క అయినా దగ్గుబాటి పురందరేశ్వరి మేనల్లుడు. ఈయనకు హీరో బాలకృష్ణకు మంచి ఫ్రెండ్‌షిప్ ఉండేది. ఈ దోస్తానాతోనే బాలయ్యతోె ఒక సినిమాను నిర్మించాలనుకున్నారు. అందులో భాగంగా బాలకృష్ణతో కలిసి యువరత్న ఆర్ట్స్ స్థాపించి.. ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ‘నిప్పురవ్వ’ సినిమాను తెరకెక్కించారు. ఆ సినిమాలో హీరోయిన్‌గా పలువురు పేర్లు పరిశీలించి చివరకు విజయశాంతిని ఎంపిక చేసారు. ఆ సినిమాలో నటింపజేసేందకు ప్రసాద్.. స్వయంగా విజయశాంతి దగ్గరకు వెళ్లారు.

అలా వాళ్ల మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. ఈయన నిర్మాతగా బాలయ్యతో కలిసి ‘నిప్పురవ్వ’ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజిగా నిలిచింది. ఇక బాలయ్య, విజయశాంతి కాంబినేషన్‌లో వచ్చిన చివరి సినిమా ఇదే కావడం విశేషం.

విజయశాంతి 13 సంవత్సరాల విశ్రాంతి తర్వాత సినిమాకి తిరిగి వచ్చారు, 2020లో మహేష్ బాబు ప్రధాన కథానాయకుడిగా నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించారు.

Vijayashanti Political Career:

విజయశాంతి 1998లో రాజకీయ రంగంలోనికి ప్రవేశించింది.

1998లో, Vijayashanti మొదట భారతీయ జనతా పార్టీ లో చేరింది, వెంటనే బిజెపి మహిళా విభాగం (భారతీయ మహిళా మోర్చా) కార్యదర్శిగా చేశారు. 1998లో బీజేపీకి మద్దతుగా విజయశాంతి మొదటి బహిరంగ సభ నెల్లూరులో జరిగింది. 1999 సార్వత్రిక ఎన్నికల సమయంలో, Vijayashanti సోనియా గాంధీ (కాంగ్రెస్)కి వ్యతిరేకంగా కడప లోక్‌సభ స్థానం నుండి బిజెపి తరపున పోటీ చేసింది. అయితే సోనియా గాంధీ బళ్లారి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో విజయశాంతి పోటీ నుంచి తప్పుకున్నారు.

1996లో, బీజేపీకి అనుకూలమైన విజయశాంతి, అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK)కి తన మద్దతును ప్రకటించారు. ఆ తర్వాత విజయశాంతి అప్పటి ముఖ్యమంత్రి జయలలితకు స్టార్ క్యాంపెయినర్‌గా పనిచేశారు. తరువాత తమిళనాడులో బీజేపీ లోక్‌సభ ఎన్నికలకు క్రికెటర్ శ్రీకాంత్‌తో పాటు విజయశాంతి స్టార్ క్యాంపెయినర్ పనిచేసారు.

2005లో విజయశాంతి సొంతంగా రాజకీయ పార్టీని ప్రారంభించారు. బలం మరియు మద్దతు లేకపోవడంతో, విజయశాంతి జనవరి 2009 లో తల్లి తెలంగాణ పార్టీని తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) లో విలీనం విలీనం చేసి టీఆర్ఎస్ లో చేరింది. విజయశాంతి 2009లో మెదక్ పార్లమెంట్ స్థానం నుండి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచింది.

2011లో తెలంగాణ ఉద్యమంలో కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో కలిసి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా సరైన ఫార్మాట్‌లో లేకపోవడంతో సభ స్పీకర్ దానిని తిరస్కరించారు. తరువాత, విజయశాంతి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం రాజకీయాల్లో చురుకుగా పాల్గొంది, అందులో కీలక పాత్ర పోషించింది.

విజయశాంతి ని 2013లో పార్టీవ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొంటుందని టీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు. విజయశాంతి 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరింది. విజయశాంతి 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యింది.

విజయశాంతి 07 డిసెంబర్ 2020న భారతీయ జనతా పార్టీ లో చేరింది.