Indraja

Indraja Biography in Telugu:

ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ హీరోలతో సినిమాలు చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్న బ్యూటీ ఇంద్రజ. అలీ లాంటి కామెడీ హీరోల నుంచి బాలయ్య, మోహన్ లాల్ లాంటి సూపర్ స్టార్స్ వరకు అందరితోనూ జోడీ కట్టింది ఇంద్రజ. కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్‌గా వెలిగింది.

తెలుగు, తమిళం, మలయాళంలో దాదాపు 50 సినిమాలకు పైగానే నటించారు ఈమె. ఇప్పుడు చాలా రోజుల తర్వాత మళ్లీ బుల్లితెరపై కనిపిస్తూ సందడి చేస్తున్నారు. ఆ మధ్య రోజా లేనపుడు కొన్ని రోజుల పాటు జబర్దస్త్ కామెడీ షోలో జడ్జిగా కొత్త ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. మరో జడ్జి రోజా కొన్ని రోజులు బ్రేక్ తీసుకోవడంతో ఇప్పుడు ఆమె స్థానంలో ఇంద్రజ వచ్చారు.

సినిమాల మాదిరే జబర్దస్త్‌లోనూ తనదైన గుర్తింపు వేసుకుంటున్నారు ఇంద్రజ. ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీకి పర్మినెంట్ జడ్జి అయిపోయారు. మంచి జడ్జిమెంట్‌తో అక్కడ కూడా అభిమానులను సంపాదించుకుంటున్నారు ఇంద్రజ. ఈమెకు తెలుగుతో పాటు మిగిలిన భాషల్లోనూ మంచి గుర్తింపు ఉంది.

Early Life:

ఇంద్రజ అసలు పేరు రాజాతి. ఇంద్రజ 30 జూన్ 1978న చెన్నైలోని ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. సంగీతంలోనూ ఇంద్రజకు ప్రవేశం ఉంది. అయితే సినిమాల్లోకి రావడానికి పేరు మార్చుకుంది. ఇంద్రజ కు ఇద్దరు సిస్టర్స్, భారతి, శోభ ఈమె చెల్లెళ్లు.

పాఠశాలలో కూడా ఇంద్రజ అనేక సంగీత, నాటక పోటీలలో పాల్గొని బహుమతులు అందుకొన్నది. శాస్త్రీయ నాట్యములో శిక్షణ పొందిన ఈమె మాధవపెద్ది మూర్తి వద్ద కూచిపూడి నృత్యరీతులు అభ్యసించింది. ఈమె మూర్తి బృందముతో పాటు పర్యటించి విదేశాలలో ప్రదర్శనలు ఇచ్చింది.

Career:

1994లో ఇంద్రజ 15 ఏళ్ల వయసులో ఉజ్జైప్పలి అనే తమిళ్ సినిమాతో తన ప్రస్థానం మొదలుపెట్టారు. తరువాత పురుష లక్షణం అనే తమిళ్ సినిమా లో నటించింది.

ఆలీ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘యమలీల’ సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైన ఇంద్రజ.. ముందుగా నాగార్జున హీరోగా నటించిన ‘హలో బ్రదర్’ సినిమాలో ఓ పాటలో మెరిసింది.

తెలుగులో చిరంజీవి తప్ప మిగతా అగ్ర హీరోలందరి సరసన మెరిసింది ఇంద్రజ. ఇంద్రజ తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ సరసన ‘అమ్మ దొంగా’, బాలయ్య సరసన పెద్దన్నయ్య చిత్రాల్లో నటించింది. నాగార్జునతో ‘హలో బ్రదర్’తో పాటు, వజ్రంలో ఓ పాటలో మెరిసింది. వెంకటేష్ సరసన ‘చిన్నబ్బాయి’ లో నటించిన తెలుగులో మాత్రం స్టార్ హీరోయిన్ రేంజ్ దక్కించుకోలేకోయింది.

కానీ మలయాళంలో మాత్రం ఈమె స్టార్ హీరోయిన్ రేంజ్ ఎదిగింది. మలయాళంలో ఇంద్రజ మోహన్‌లాల్, మమ్ముట్టి, సురేష్ గోపీ వంటి స్టార్ హీరోలు సరసన నటించింది. అంటు తమిళం,కన్నడలో పలు చిత్రాల్లో నటిచింది.

Marriage:

2005లో, ఇంద్రజకు వ్యాపారవేత్త మహ్మద్ అబ్సర్‌తో వివాహం జరిగింది. ఈ దంపతులకు సారా అనే కుమార్తె ఉంది. పెళ్లి తరువాత ఇంద్రజ కొన్ని ఇయర్స్ గ్యాప్ తీసుకుంది…

Re-Entry (after break):

2014లో, సినిమాలకు తిరిగి వచ్చింది… సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన సాఫ్ట్‌వేర్ సుధీర్‌లో హీరో తల్లిగా నటించారు. ఆ తర్వాత అల్లుడు అదుర్స్‌లోనూ తల్లి పాత్రలో నటించారు.

ప్రస్తుతం ఇంద్రజ తెలుగులో జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి పలు రియాలిటీ షోలకు జడ్జ్‌గా వ్యహరిస్తోంది.

Indraja Date of Birth, Age, Marriage, Husband, Career, Movies, Shows, Wiki, Biography & More:

Indraja
Real NameRajathi
Screen NameIndraja
ProfessionActress and Dancer
Debut MovieUzhaippali (Tamil, 1993)
Height172 cm (5′ 6″)
Weight65 kgs (143 Ibs)
Body Measurements36-30-36
Eye ColourBrown
Hair ColourBlack
Date of Birth30th June 1978 (Friday)
Age (As in 2022)44 Years
Birth PlaceChennai, Tamil Nadu, India
HometownChennai, Tamil Nadu, India
Zodiac SignLibra
NationalityIndian
SchoolNot Known
CollegeNot Known
Educational QualificationsGraduation
Father NameName Not Known
Mother NameName Not Known
Sister NameBharathi and Shobha
Marital StatusMarried
Marriage Date2005
Husband NameMohammed Absar
Daughter NameSara