తెలుగు సినిమా దిగ్గజం, ప్రముఖ విలక్షణ నటుడు, నవరస నటనా సార్వభౌముడు శ్రీ Kaikala Satyanarayana గారు కన్నుమూశారన్న వార్త తెలుగు చలన చిత్ర పరిశ్రమను తీవ్ర విషాదాన్ని గురిచేసింది.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు ఫిలింనగర్‌లోని తన నివాసంలో ఈరోజు ఉదయం 4.30 గంటలకు నటుడు కైకాల సత్యనారాయణ తుదిశ్వాస విడిచారు.
కైకాల సత్యనారాయణ తెలుగు సినీమా సీనియర్ నటుడు, భారత పార్లమెంటు మాజీ సభ్యుడు. 60 సంవత్సరాల సినీజీవితంలో ఉన్న ఆయన 777 సినిమాల్లో నటించాడు. ఒక నటుడిగా అతను పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసాడు. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించాడు.
తెలుగులో యముడు, భీముడు పాత్రలు అంటే నాకు వారే గుర్తుకు వస్తారు, ఆయన పవిత్ర ఆత్మకు శాంతిని చేకూర్చాలని మరియు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
Kaikala Satyanarayana Career:
1935 జులై 25న కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో జన్మించారు. విజయవాడ, గుడివాడలో విద్యాభ్యాసం చేశారు. కైకాల సత్యనారాయణ నవరస నటసార్వభౌమగా ప్రసిద్ది చెందారు.కైకాల భార్య నాగేశ్వరమ్మ, ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 1959లో సిపాయి కూతురు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కైకాల మరణం 60 సంవత్సరాల సినీజీవితంలో ఉన్న ఆయన 777 సినిమాల్లో నటించాడు. ఒక నటుడిగా అతను పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసాడు. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించాడు. తెలుగులో యముడు,భీముడు పాత్రలు అంటే కైకాల గుర్తుకు వస్తారు. బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో కనిపించారు.ఇక కైకాల చివరిగా సూపర్ స్టార్ మహేష్ “మహర్షి” లో నటించారు.
Kaikala Satyanarayana రాజకీయ జీవితం:
కైకాల సత్యనారాయణ రాజకీయ రంగంలోనూ తనదైన ముద్రవేశారు. ఎంపీగా ప్రజలకు సేవలు అందించారు. తెలుగుదేశం పార్టీ (TDP)తో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది.కాగా ఎన్టీఆర్ టీడీపీ పార్టీని స్థాపించినప్పుడు ఆయనకు తోడుగా ఉన్నారు. కైకాల సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు.టీడీపీలో ఉన్నప్పటికీ చాలా కాలం వరకు ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. నాటి సీఎం నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు 1996లో మచిలీపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. తర్వాతి ఎన్నికల్లో ఓటమి చెందడంతో రాజకీయాలకు కైకాల సత్యనారాయణ దూరమయ్యారు. అప్పటీ నుంచీ సినిమాలకు మాత్రమే పరిమితమయ్యారు.
200 మందికి పైగా దర్శకులతో కైకాల పని చేసారు. ఎన్టీఆర్ అగ్గిపిడుగు చిత్రంతో కైకాల సినీ జీవితం మలుపు తిరిగింది. ఎన్టీఆర్ తో కలిసి 101 చిత్రాల్లో కైకాల సత్యనారాయణ నటించారు. రాముడు-భీముడు వంటి ఎన్.టి.ఆర్. ద్విపాత్రాభినయ చిత్రాలలో ఆయనకు డూప్ గా తన సామర్ధ్యం నిరూపించుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్. వి. రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన నటుడు కైకాల. 2017లో జీవన సాఫల్య పురస్కారం దక్కించుకున్నారు. కైకాల నటించిన బంగారు కుటుంబంకు నంది అవార్డు దక్కింది. ఇదే సంవత్సరం కృష్ణంరాజు, కృష్ణ వంటి వారిని కోల్పోయిన తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడు మరో లెజెండరీ నటుడుని కోల్పోయింది.
End of An ERA:
తెలుగు సినిమా చరిత్రలో నేటితో ముగిసిన ఒక శకం కైకాల సత్యనారాయణ …
ఆయన్ని హీరో అందామంటే భయంకరమైన విలన్ వేషాలు వేశాడు…
అలా అని విలన్ అనేద్దామంటే కడుపుబ్బా నవ్వించే కామెడీ పండించాడు..
సరే, పోనీ కమెడియన్ అనుకునేద్దామంటే …
కొన్ని పాత్రల్లో కన్నీరు పెట్టించాడు …
రావణాసురుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు వంటి పాత్రలతో పౌరాణికాల్లో …
కత్తి యుధ్ధాలు, గుర్రపు స్వారీలతో జానపదాల్లో …
యముడు, ఘటోత్కచుడు క్యారెక్టర్లతో ఫాంటసీల్లో …
ఇలా ఎందులో అయినా ఇట్టే ఒదిగిపోవటం ఆయన శైలి …
ఆ అభినయం, వాచికం, ఆహార్యం –
అన్నింటా ఆయన ప్రతిభాశాలి …
అన్న, తండ్రి, తాత …
ఇలా ఏ తరం పాత్రైనా అందులో ఒదిగిపోయే ఆయన నటనా శైలి తరతరాల నటులకు ఆదర్శం…
ఇన్ని రకాల పాత్రల్లో జీవించిన అయన పేరు ముందు చేరటానికి ఆ ‘చిన్న చిన్న’ పేర్లు ఎక్కడ సరిపోతాయి… అందుకే ‘నవరసనటనాసార్వభౌమ’ అనటమే సరైన ఉపమానం !!
తెలుగు చలనచిత్ర సీమలో అతనొక నటశాల …
వెండితెరపై నిండైన తెలుగుదనం – మన కైకాల …
వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్దిద్దాం…!!
ఓం శాంతి….