Prabhas Biography in Telugu

Prabhas Biography in Telugu:

బాహబలి సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. బిజ్జలదేవ ఓ సందర్భంగా అమరేంద్ర బాహుబలి గురించి చెబుతాడు. ఆడు బతికి ఉంటే.. ఎక్కడున్నా రాజేరా అని అంటాడు.

అది ఇప్పుడు నిజ జీవితంలో ప్రభాస్‌కు వర్తిస్తుంది. రాజుల రక్తం ఒంట్లో పారుతున్న ప్రభాస్.. ఇప్పుడు భారత సినీ రాజ్యానికి ఏకఛత్రాధిపతి అయ్యాడు. అసలు సిసలు పాన్ ఇండియన్ హీరోగా మారిపోయాడు.

ఒక ప్రాంతీయ హీరోగా మొదలు పెట్టి జాతీయ స్థాయి హీరోగా ఎదిగిన ప్రభాస్ బయోగ్రఫీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Prabhas Early Life & Education:

ప్రభాస్ పూర్తి పేరు Venkata Suryanarayana Prabhas Raju… 1979 అక్టోబర్ 23న ఉప్పలపాటి సూర్యనారాయణరాజు, శివకుమారి దంపతులకు పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు గ్రామంలో జన్మించారు ప్రభాస్. ప్రభాస్ కు అన్నయ్య ప్రభోద్, చెల్లెలు ప్రగతి ఉన్నారు.

ప్రభాస్ తన స్కూలింగ్ నీ భీమవరంలోని DNR స్కూల్ లో చదివాడు, next హైదరాబాద్‌లోని నలంద కాలేజీ లో ఇంటర్మీడియట్ చదివాడు. ఆ తర్వాత ప్రభాస్ హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య కాలేజీలో బీటెక్ చేశారు.

Prabhas Career:

2002 నవంబర్ 11న రిలీజ్ అయిన ఈశ్వర్ మూవీతో ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అప్పట్లో కృష్ణంరాజు కు ఉన్న రెబల్ స్టార్ బిరుదు ఈ జనరేషన్ లో ప్రభాస్ కు వచ్చింది.

ఈశ్వర్ సినిమాతో మొదలైన ప్రభాస్ ప్రయాణం అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. రెండో చిత్రంగా వచ్చిన రాఘవేంద్ర అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ మూడో సినిమాగా వచ్చిన వర్షం ప్రభాస్‌ను స్టార్ హీరోగా నిలబెట్టేసింది.ఆ తరువాత ఎన్నో అంచనాలతో వచ్చిన అడవి రాముడు, చక్రం మూవీస్ అంతగా ఆకట్టుకోలేకపోయి.

2005 సెప్టెంబర్ 30 తేదీన విడుదలైన ఛత్రపతి సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ కెరీర్ గ్రాఫ్ ని అమాంతం మార్చేసింది. బి.వి.ఎస్ నిర్మాతగా, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఛత్రపతి బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించింది. 12.50 కోట్లతో నిర్మించిన సినిమా 30 కోట్ల షేర్ వసూలు చేయడం విశేషం. దీంతో తిరుగులేని మాస్ ఫాలోయింగ్‌తో ముందుకు దూసుకుపోయాడు.

2006 నుండి 2010 వరకు ప్రభాస్ కు అంతగా కలసి రాలేదని చెప్పుకోవచ్చు. ఈ నాలుగేళ్లలో విడుదలైన పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా, ఏక్ నిరంజన్ వంటి సినిమాలు ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలు అందుకోలేకపోయాయి.

2010 ఏప్రిల్ 10న విడుదలైన డార్లింగ్ ప్రభాస్ కి చాలా కాలం తర్వాత మంచి హిట్ మూవీగా నిలిచింది. ఆ తరువాత 2011లో విడుదలైన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ అప్పటి వరకు ప్రభాస్ కెరీర్ బెస్ట్ హిట్ గా నిలిచింది.

ప్రభాస్ కెరీర్‌లో మాస్, క్లాస్ హిట్స్ ఉన్నాయి. ఛత్రపతి మాస్ హిట్ అయితే.. మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్ వంటి చిత్రాలు క్లాస్ హిట్స్‌గా నిలిచాయి. మాస్ కి రెబెల్ స్టార్, క్లాస్ కి డార్లింగ్… అలా ప్రభాస్ మాస్ ఆడియెన్స్, క్లాస్ ఆడియెన్స్ అని తేడా లేకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

బ్యాక్ 2 బ్యాక్ హిట్స్ రావడం తో ప్రభాస్ నెక్స్ట్ మూవీ మీద బారి అంచనాలు ఉంటాయి… అలంటి టైం లో రెబెల్ స్టార్ రెబెల్ టైటిల్ తో వస్తే ఫాన్స్ లో అంచనాలు ఏ స్థాయి లో ఉంటాయి… కానీ రెబెల్ మూవీ అనుకున్న అంత మేపించలేదు.

2013 ఫిబ్రవరి 8ని ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటికీ మరచిపోలేరు. ఆ రోజే మిర్చి మూవీ విడుదలైంది. కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అని ప్రభాస్ మిర్చి సినిమాలో చెప్పిన డైలాగ్ ప్రభాస్ కు సరిగ్గా సూటవుతుంది. ప్రభాస్ కటౌట్ అలా ఉంటుంది మరి… అప్పటివరకూ ఉన్న ప్రభాస్ కు ఈ సినిమాలో కనిపించిన ప్రభాస్ కు చాలా డిఫరెంట్ ఉంటుంది. ఒక రకంగా ఆ క్రెడిట్ డైరెక్టర్ కొరటాలకే చెందుతుంది అని చెప్పొచ్చు. ప్రభాస్ మేకోవర్ మొత్తం మార్చేశాడు. మంచి స్టైలిష్ లుక్ తో చూపించడమే కాదు అందుకు తగ్గ యాక్షన్ సీన్స్, డైలాగ్స్ అన్నీ కలిసి ఒక మంచి పవర్ ఫుల్ ప్యాక్డ్ సినిమాను అందించారు.

Prabhas Career From Baahubali The Beginning:

2013లో మిర్చి సక్సెస్ తరువాత ప్రభాస్ ఇండస్ట్రీ తలరాతని మార్చేసే నిర్ణయం తీసుకున్నారు. అదే బాహుబలికి ఓకే చెప్పడం. మరో సినిమాకి కమిట్ కాకుండా బాహుబలి కోసమే బల్క్ గా డేట్స్ ఇచ్చేశాడు ప్రభాస్. సుమారు మూడేళ్ళ గ్యాప్ తరువాత “బాహుబలి ది బిగినింగ్” ప్రేక్షకుల ముందుకి వచ్చింది. సుమారు రూ.180 కోట్ల బడ్జెట్‌ తో తెరకెక్కిన సినిమా ఓవరాల్ రన్ లో రూ.650 కోట్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరించింది. ఇదే.. గొప్ప అనుకుంటే బాహుబలి-2 ఊహలకి సైతం అందని రికార్డ్స్ నెలకొల్పింది. 2017 ఏప్రిల్ 18న విడుదలైన “బాహుబలి-2” ప్రపంచ వ్యాప్తంగా తెలుగోడి సత్తా చాటింది. రూ.250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన “బాహుబలి కంక్లూజన్” సుమారు రూ.2000 కోట్లు కలెక్ట్ చేయడం విశేషం.

ఈ దెబ్బతో ఇండియన్ సినీ హీరోలు అంతా ప్రభాస్ కి సాహో అనేశారు. 2019లో ఎన్నో అంచనాల నడుమ పాన్ ఇండియా మూవీగా విడుదలైన సాహో ప్రేక్షకులను ఆసించిన మేర ఆకట్టుకోలేకపోయింది. కానీ.., ప్రభాస్ క్రేజ్‌ తోనే ఆ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.430 కోట్లు కలెక్ట్ చేసింది.

జాతీయస్థాయి దాటి అంతర్జాతీయ స్థాయికి ప్రభాస్ ఇమేజ్ పెరిగింది. చైనా, జపాన్ వంటి దేశాల్లో ప్రభాస్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. ఇప్పుడు ప్రభాస్ సినిమా అంటే జపాన్, చైనా వంటి ఇతర దేశాల్లోనూ రిలీజ్ కావాల్సిందే. అలా ప్రభాస్ ఇప్పుడు లైన్‌లో పెట్టిన చిత్రాలు కూడా అదే విధంగా రాబోతోన్నాయి.

ప్రభాస్ తో సినిమాలు చేయడానికి అంతా పోటీ పడుతున్నారు. కానీ.., మన బాహుబలి మాత్రం తన స్థాయికి తగ్గ ప్రాజెక్ట్స్ ని సెలెక్ట్ చేసుకుంటూ ముందుకి పోతున్నాడు.

Prabhas next movie ఆదిపురుష్ త్వరలోనే విడుదల కానున్న విషయం తెలిసిందే. తరువాత.. తరువాత సలార్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ చిత్రాలు ఇలా అన్నీ కూడా పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌లే. వాటిని అంతర్జాతీయ స్థాయిలోనే తెరకెక్కిస్తున్నారు. అలా ప్రభాస్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడున్నా రాజే అని నిరూపించుకుంటున్నాడు.

Prabhas Age, Marriage, Wife, Family, Movies List, Net Worth, Wiki, Biography & More:

Prabhas
Real NameUppalapati Venkata Suryanarayana Prabhas Raju
Screen NamePrabhas
Also Known asRebel Star
ProfessionActor
Debut MovieEeshwar (Telugu, 2002)
Height185 cm (6′ 1″)
Weight95 Kgs (209 Ibs)
Body MeasurementsChest: 44 Inches
Waist: 34 Inches
Biceps: 18 Inches
Eye ColourBlack
Hair ColourBlack
Date of Birth (Birthday)23rd October 1979 (Wednesday)
Age (as in 2022)43 Years
Birth PlaceChennai, Tamil Nadu, India
HometownHyderabad, Telangana, India
Lives inHyderabad, Telangana, India
Zodiac SignLibra
ReligionHindu
NationalityIndian
SchoolDon Bosco Matriculation Higher Secondary School, Chennai
DNR High School, Bhimavaram
CollegeNalanda College, Hyderabad
Sri Chaitanya College, Hyderabad
Educational QualificationsB. Tech
Father NameUppalapati Surya Narayana Raju
Mother NameSiva Kumari
Brother NamePramod Uppalapati
Sister NamePragathi

Also Check: Ram Charan Movies List